మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి..

హైదరాబాద్  మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది .. సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసి వ్యభిచార రాకెట్ ను బట్టబయలు చేశారు.

 

మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో,మాదాపూర్, కూకట్‌పల్లి ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ప్రధాన నిందితుడు ధనంజయతో పాటు నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

అపార్ట్‌మెంట్‌లో ఉన్న నలుగురు మహిళలను రక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు.. రోజువారీ అద్దెకు గదులు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు.ప్రధాన నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.1,48,970 నగదు స్వాధీనం..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు