భూపాలపల్లి జిల్లాలో దారుణం వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య

భూపాలపల్లి జిల్లాలో దారుణం..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య…

ప్రియుడితో కలిసి పురుగుల మందు కలిపిన మద్యం తాగించి ఆత్మహత్యగా చిత్రీకరణ

మృతుడి తల్లి ఫిర్యాదుతో బయటపడ్డ హత్యోదంతం

 

భూపాలపల్లి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. .వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి పురుగుల మందు కలిపిన మద్యం తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించింది , వివరాల్లోకి వెళితే,

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను పదేళ్ల క్రితం వివాహం చేసుకుని, గొల్లపల్లికి చెందిన పెండల సంపత్(32) అనే వ్యక్తి ఇద్దరు పిల్లలతో అత్తగారింట్లోనే ఉంటూ ప్లంబర్ పనులు చేస్తుండేవాడు.అయితే బుద్దారం గ్రామంలో ఉండే ఉమ్మల శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న సుమలత ప్రియుడు శ్రీకాంత్ తో కలిసి తరుణ్ అనే వ్యక్తిని సంప్రదించి తమకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తామని చెప్పి, తరుణ్  సహకారంతో, ఈ నెల 17వ తేదీన సంపత్‌ను మద్యం తాగేందుకు  శ్రీకాంత్, తరుణ్ లు పిలిచారు.
ఊరిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో పురుగుల మందు కలిపిన మద్యం  తాగించి, సంపత్ మరణించాక మృతదేహాన్ని తరుణ్, శ్రీకాంత్ లు బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం మృతదేహం చుట్టూ పురుగుల మందు చల్లి, తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని సంపత్ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను సుమలత నమ్మించే ప్రయత్నం చేసింది.
ఇది ఇలా ఉంటే  పోలీసులు సైతం ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం పూర్తి చేయడంతో, తప్పించుకున్నామని  సుమలత, శ్రీకాంత్ లు భావించారు. అయితే తన కొడుకుది ముమ్మాటికీ హత్యేనని సంపత్ తల్లి ఫిర్యాదు చేయటంతో  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన శ్రీకాంత్, సుమలత లు పెద్దల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు