ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్, 70 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.38 లక్షలు కాజేసిన హనీట్రాప్

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్, 70 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.38 లక్షలు కాజేసిన హనీట్రాప్…

పేస్ బుక్ లో యువతుల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా? అయితే ముందు వెనుకా చూసుకోకుండా ఆ రిక్వెస్ట్ ను ఓకే చేసే ముందు ఆలోచన చేసుకోకపోతే మీరు అడ్డంగా బుక్ అయిపోయినట్టే… హనీ ట్రాప్ కు చిక్కి మీ బ్యాంకు బ్యాలన్స్ కోల్పోవచ్చు. బెదిరింపులకు గురి కావచ్చు… ఇలాగే ఒక 70 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి హనీ ట్రాప్ లో చిక్కి 38 లక్షలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి మహిళ పేరుతో ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అంగీకరించిన తర్వాత చాటింగ్ మొదలై,ఇంటి అవసరాల పేరుతో ఆ మహిళ రిటైర్డ్ ఉద్యోగిని  డబ్బులు అడిగారు.ఆ తర్వాత మరో వ్యక్తి ఆమె బంధువుగా పరిచయం చేసుకున్నాడు. మహిళతో సన్నిహిత, లైంగిక చాటింగ్ చేయించి ఫేస్‌బుక్ సంభాషణలను అడ్డుపెట్టుకుని బాధితుడిని బ్లాక్‌మెయిల్ చేయటం మొదలుపెట్టారు .
మైనర్ బాలికపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించి,బాధితుడి నుంచి సుమారు రూ.38 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత సంవత్సరం జూన్ 17, 2025న బాధితుడు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్‌లోని 66C, 66D సెక్షన్లతో పాటు BNS 308(2), 318(4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ ఫిర్యాదుపై , దర్యాప్తులో భాగంగా వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ సృష్టించి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వృద్ధులు అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, సన్నిహిత చాటింగ్‌కు దూరంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు డబ్బులు పంపొద్దని, కేసు సెటిల్‌మెంట్ పేరుతో పోలీసులు ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు