2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులపై రౌడీ షీట్లు తెరవాలన్న పోలీసుల ఆదేశాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గత నెల 22న కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఉన్న వ్యక్తులపై రౌడీ షీట్లు తెరవాలని సూచించారు.
అయితే తాజాగా గతంలో జారీ చేసిన ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలని సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు. ఈ నెల 29న కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులర్ పంపించారు. దీంతో రౌడీ షీట్ల వ్యవహారంలో పోలీస్ శాఖ వైఖరిలో మార్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు రౌడీ షీట్లు తెరవాలన్న ఆదేశాలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బెజవాడ పోలీసుల తీరుపై పలువురు వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. రౌడీ షీట్ల పేరుతో తమను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.









