SIRపై ఈసీ కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల మార్చ్!!!

SIRపై చర్యలు తీసుకోవాలని, CEC గ్యానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహిస్తున్నారు . దీంతో నిర్వాచన్ సదన్, జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆకాశవాణి భవన్ వద్ద రాహుల్, ప్రియాంక.. ఈసీ కార్యాలయం వైపు INDIA కూటమి ఎంపీల మార్చ్..

 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ గేట్ల వద్దకు చేరుకున్నారు. INDIA కూటమి ఎంపీలు ఈసీ కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఎన్నికల సంఘంపై దాఖలైన పిటిషన్లలో సవాలు చేసిన నిర్ణయాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటరు నమోదు కోసం ఉపయోగిస్తున్న సవరించిన ఫాం-6ను తాము ఆమోదించలేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే, CECని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు