పోలవరం స్పిల్ వే ను తాకిన ఆరో ఏడాదీ వరద జలసవ్వడి ..

గోదావరి వరద జలాల మహాప్రవాహం! ఏ ఏడాది ఎన్ని వేల టీఎంసీలు దిగువకు వెళ్లాయంటే…

 

 

 ” ది గ్రేట్ వాటర్ వాల్ ఆఫ్ పోలవరం – స్పిల్ వే ! ” జలశయ నీటి నిల్వ సామర్ద్యం (పూర్తయ్యాక ) 194 టిఎంసిలు…. అయితే వేల టిఎంసిల నీటిని ఈ స్పిల్ వే ప్రారంభానికి ముందే తనలో సంగమం చేసుకుని కిందకు పంపిస్తోంది.  ఈ చర్యను ‘గ్రేట్ వాటర్ వాల్ ఆఫ్ పోలవరంగా’ పిలవవచ్చేమో కదా. 

 

 

ప్రతి వర్షాకాలంలో ఉప్పొంగే గోదావరి… పోలవరం స్పిల్‌వేను ముద్దాడుతూ, గేట్లను తాకి పులకరిస్తూ, జలహోరుతో దిగువకు పరుగులు తీస్తోంది. ప్రకృతి పరవళ్లు… ఇంజినీరింగ్ అద్భుతాన్ని పలకరిస్తున్న అపురూప దృశ్యమిది! కాగా పోలవరం వద్ద నమోదైన గోదావరి వరద ప్రవాహాల రికార్డులను టీఎంసీలుగా మార్చి పరిశీలిస్తే ఆసక్తికరమైన జలచిత్రం కనిపిస్తోంది.

 

2019లో జులై 27 నుంచి అక్టోబర్ 10 వరకు 3,443 టీఎంసీలు, 2020లో జులై 1 నుంచి అక్టోబర్ 8 వరకు 3,141 టీఎంసీలు ప్రవహించినట్లు లెక్కలు సూచిస్తున్నాయి..2021లో జూన్ 22 నుంచి డిసెంబర్ చివరి వరకు 2,635 టీఎంసీలు, 2022లో జనవరి నుంచి డిసెంబర్ 13 వరకు ఏకంగా 5,123 టీఎంసీల ప్రవాహం నమోదైనట్లు అంచనా..2023లో జులై–అక్టోబర్ మధ్య 3,063 టీఎంసీలు, 2024లో జులై 20 నుంచి సెప్టెంబర్ చివరి వరకు 3,620 టీఎంసీలు ప్రవహించినట్లు లెక్కల్లో వెల్లడైంది.

 

ఇది ఇలా ఉంటే 2026లో సెప్టెంబర్ 30 వరకు సుమారు 1,786 టీఎంసీల  ప్రవాహం నమోదైంది సంవత్సరంలెక్కించిన కాలంప్రవాహం (టీఎంసీలు) 2019జులై 27–అక్టోబర్ 10- 3,442.52
~ 2020జులై 1–అక్టోబర్ 8 – 3,140.83
~ 2021జూన్ 22–డిసెంబర్ 31 -2,634.99
~ 2022జనవరి 1–డిసెంబర్ 13 – 5,123.20
~ 2023జులై 1–అక్టోబర్ 18 -3,063.16
~ 2024జులై 20–సెప్టెంబర్ 30 – 3,620.46
~ 2026జూన్ 23–సెప్టెంబర్ 30 – 1,786.17
అయితే ఇవన్నీ అందుబాటులో ఉన్న రికార్డుల కాలాలకు సంబంధించిన అంచనాలే. పూర్తి సంవత్సరాల మధ్య నేరుగా పోల్చలేం. పోలవరంతో పాటు అప్రోచ్ చానల్, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ పూర్తయ్యాక 2021 జూన్లో నీటిని స్పిల్ వే మీదుగా మళ్ళించారు @MEIL_Group . అప్పటి నుంచీ వరద ఒరిజనల్ నదిలో కాకుండా స్పిల్ వే మీదుగా వెళ్లడం మొదలయ్యింది. అప్పటి నుంచీ ప్రతి ఏడాది వరద స్పిల్ వే తాకి పులకరించి గేట్ల మీదుగా కిందకు వెళుతోంది.
పోలవరం ప్రాజెక్టును 2004లో చేపట్టారు. క్లిష్టమైన అనుమతులన్నీ అప్పుడే సాధించగా, తొలుత కాలువల తవ్వకాలు తర్వాత పోలవరం హెడ్ వర్క్స్ మొదలయ్యాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే … పోలవరం నుంచి దిగువకు వెళ్లిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసినట్లు కాదు. దిగువ గోదావరి డెల్టా వినియోగం, ధవళేశ్వరం నుంచి సముద్రానికి విడుదలైన మిగులు జలాలు వేర్వేరుగా లెక్కించాల్సి ఉంటుంది .

 

గోదావరిలో ఇంత భారీ జలప్రవాహం నమోదవుతున్న నేపథ్యంలో వరద నీటి నిల్వ, వినియోగం, జలాల మళ్లింపు సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు గుర్తుచేస్తున్నాయి. 2022లో 5,123 టీఎంసీలు దాదాపు ఏడాది కాలానికి సంబంధించిన లెక్క. 2024లో 3,620 టీఎంసీలు కేవలం జులై–సెప్టెంబర్ కాలానికి సంబంధించినవి. కొన్ని కాలాల్లో నమోదులు లేనందున ఇవి పూర్తి వార్షిక మొత్తాలు కావు.

 

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు