తెలంగాణ SIR ప్రక్రియలో ముగిసిన అభ్యంతరాల గడువు..

తుది జాబితాలో 2.43 కోట్ల మంది ఓటర్లు..

 

రాష్ట్రంలో జరుగుతున్న SIR ప్రక్రియలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువు ముగియడంతో తుది ఓటర్ల జాబితాలో 2,43,23,059 మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం.కాగా 1,71,99,536 మంది ఓటర్లు నేరుగా తుది జాబితాలోకి చేరగా, 93 లక్షల మందికి ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది.

 

నోటీసులు అందుకున్న వారిలో 71,23,526 మంది ఓటర్ల పత్రాలు సక్రమంగా ఉండడంతో 2,43,23,059 మంది ఓటర్లు తుది జాబితాలో చేరనున్నట్టు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది.నోటీసులు అందుకున్న 21,64,654 మంది, కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 4.5 లక్షల మంది దరఖాస్తులపై ఇంకా విచారణ జరుగుతుందని, ఈ విచారణ పూర్తయ్యాక నవంబర్ 9వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని, ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

మొత్తంగా తెలంగాణలో SIR ప్రక్రియ ద్వారా  73,39,235 ఓట్లు తొలగిపోనున్నట్టు తెలుస్తోంది.తెలంగాణలో 91,92,625 మందికి SIR నోటీసులు జారీ చేశారు. 71,23,526 మంది తుది జాబితాకు అర్హులుగా నిర్ధారించినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు