రాబోయే పండుగల సీజన్ నేపథ్యంలో టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గౌలిపురా, మలక్‌పేట, జియాగూడ, బడంగ్‌పేటలో 12 పానీ పూరీ తయారీ యూనిట్లను తనిఖీ చేశారు.కాగా పలు యూనిట్లలో అపరిశుభ్ర పరిస్థితులు కనిపించాయి. కార్మికులు క్యాప్స్, గ్లౌజులు లేకుండా.. చెమటలు పడుతున్నా, మురికి దుస్తులతోనే ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఇది ఇలా ఉంటే ముడి పదార్థాలు, తయారైన పానీని నేలపైనే ఉంచినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని యూనిట్లలో FSSAIతో పాటు ఇతర లైసెన్సులు లేకపోవడం లేదా ప్రాంగణంలో ప్రదర్శించకపోవడం బయటపడింది.

CURE పరిధిలోని మొత్తం 12 యూనిట్లపై తనిఖీలు జరిగాయి. గుర్తించిన ఉల్లంఘనల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 7









