చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు సందర్భంగా
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.
ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :టుడే 9 ప్రతినిధి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం , రామాలయం సమీపము నందు గల శ్రీ చిన్న జీయర్ స్వామి మఠంలో జరిగిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ శ్రీ చిన్న జీయర్ స్వామి మఠం, లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, వికాస తరంగిణి వారు భద్రాచలం నియోజకవర్గంలో చేస్తున్న అనేక రకాల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో పనిచేసే 80 మంది మహిళ కార్మికులకు వస్త్రాలను శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో శ్రీనివాసరావు,
జీయర్ మఠం అధ్యక్షులు వెంకటాచార్య, భద్రాద్రి ఆలయ వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.









