కాలు విరిగిన విద్యార్థి కి ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి. బి. రాహుల్ చేతుల మీదుగా ఆర్ధిక సహాయం.

కాలు విరిగిన విద్యార్థి కి ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి. బి. రాహుల్ చేతుల మీదుగా ఆర్ధిక సహాయం.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 21: టుడే 9 ప్రతినిధి

కళాశాలలో చదువుతోపాటు ప్రతిరోజు క్రీడలలో సాధన చేసే సమయంలో లాంగ్ జంప్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగిపోయిన వెలకం సంతోష్ కు వైద్యం చేయించుకోవడానికి ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మంగళవారం నాడు తన ఛాంబర్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, ఆర్లపెంట గ్రామంకు చెందిన
వెలకం సంతోష్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల గుండాలలో సీఈసీ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, ప్రతిరోజు క్రీడల పీరియడ్లో లాంగ్ జంపింగ్ సాధన చేయుచుండగా అనుకోకుండా ప్రమాదవశత్తు కాలు విరిగిపోవడం జరిగిందని ఆయన అన్నారు.ఆ బాలుడి తల్లిదండ్రులు నాగరాజు, కుమారి కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని గురుకులంలో చదివిస్తున్నామని తమవద్ద ఆర్థిక స్తోమత లేదని వైద్య ఖర్చుల కొరకు సహాయం అందించాలని అర్జీ పెట్టుకోగా, ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి 25 వేల రూపాయల చెక్కును ఆ బాలుడి తల్లిదండ్రులకు అందించి సరియైన వైద్యం చేయించాలని తెలుపుతూ, సీఈసీ గ్రూప్ చదివిన విద్యార్థులు బాగా చదివి గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ కోచింగ్ తీసుకొని పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకు సాధించి ఉద్యోగాలు సంపాదించుకోని జీవనోపాధి పెంపొందించుకొని, జీవితంలో స్థిరపడాలని విద్యార్థికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏవో సున్నం రాంబాబు, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram