సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన

సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 26: టుడే 9 ప్రతినిధి

ఆదివారం న స్థానిక సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు అలాగే క్యాన్సర్ నివారణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గూడూరు సత్యనారాయణ కాకతీయ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ రవి శంకర్ ఆంకాలజిస్ట్ కౌన్సిలర్ ఆఫ్ బసవతారకం హాస్పిటల్, శ్రీ లక్ష్మయ్య జనరల్ మేనేజర్ ఆఫ్ ఏజీఎం,  జగదీష్ నెంబర్ ఆఫ్ కాకతీయ ఫౌండేషన్, శ్రీమతి కల్పన కొల్లి ఫౌండేషన్ ప్రెసిడెంట్, పసుపులేటి వీరబాబు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లైబ్రరీ చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బోయిన ఝాన్సీరాణి ఎన్ఎస్ఎస్ కమిటీ చైర్మన్, కళాశాల సైన్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ బోయిని ఝాన్సీ ఈ కార్యక్రమాల గురించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram