ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలోపాల్గొన్న ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం: నవంబర్ 9
టుడే 9 ప్రతినిధి
గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేయుచున్న ఎస్ జి టి ఉపాధ్యాయులు సబ్జెక్టుకు సంబంధించిన సామర్ధ్యాల అభివృద్ధి, హెచ్ఎం తో సమన్వయంగా ఉండేలా గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విద్యాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై శిక్షణ అందిస్తున్నట్లు ఈ శిక్షణను ఎస్జిటి ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఐటిడిఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యా సామర్థ్య అభివృద్ధి హెచ్ఎం మరియు విద్యార్థులతో ఏ విధముగా సమన్వయం చేసుకొని విద్య బోధించాలో ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమనలో పీవో ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సామర్థ్య నిర్మాణ శిక్షణ ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు.

విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక స్పృహను నేర్పిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేందుకు ఉపాధ్యాయులు ముందుండాలని ఆయన కోరారు. అలాగే జిపిఎస్ పాఠశాలలో చదువుతున్న గిరిజన చిన్నారుల మొదలుకొని ప్రైమరీ పాఠశాలల వరకు విద్యాభ్యాసం మెరుగు పరచడానికి ఉద్దీపకం వర్క్ బుక్ టు ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి ఎస్ జి టి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా జిపిఎస్ పాఠశాలల్లో చదివే గిరిజన చిన్నారులతోపాటు ప్రైమరీ పాఠశాలల్లో చదివే పిల్లలకు తప్పనిసరిగా ఉద్దీపకం వర్క్ బుక్ లోని గణితం ఇంగ్లీష్ తెలుగు పదాలు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడ్డ పిల్లలకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో మొత్తం 200 మంది ఉపాధ్యాయులు,10 మంది డి.ఆర్.పీలు పాల్గొన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్, ఏసీఎంవో రమేష్, జి సి డి ఓ అలివేలు మంగతాయారు మరియు ఎస్జిటి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.









