కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇళ్ల కోసం డబ్బులడిగితే.. రోకలిబండతో కొట్టండి అంటూ ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఎవరైనా డబ్బులడిగితే ఎలా స్పందించాలో చెబుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే భయపడకండి.. ఇంట్లో ఉన్న రోకలిబండతో వారి తలపై కొట్టండి. ఎవరైనా ఏమైనా అడిగితే నా పేరు చెప్పండి. మీ కోసం పోలీస్ స్టేషన్‌కైనా, జైలుకైనా నేనే వెళ్తాను’’ అంటూ సంజయ్ వ్యాఖ్యలు చేశారు.









