కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  అయ్యప్ప మాల వేసుకుంటున్నారా ..అయితే సెలవు తీసుకోండి…

అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్మాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బందికి సూచించింది. జుట్టు, గడ్డం పెంచుకొని, యూనిఫామ్‌కు బదులు సాధారణ దుస్తులు ధరించి, కాళ్లకు బూట్లు లేకుండా పోలీసు సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సై ఎస్‌.కృష్ణకాంత్‌ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. దీక్ష నియమాలను పాటిస్తూ విధులకు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ ఆయన ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని తిరస్కరించిన ఉన్నతాధికారులు.. నిబంధనలపై పోలీసు సిబ్బంది అందరికీ ఒక స్పష్టతనిచ్చేలా ఓ మెమోను ఇటీవల జారీ చేశారు. అయ్యప్ప మాల సహా మరే ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా ఆ దీక్ష నియమాలను పాటించాలి అనుకుంటే విధులకు సెలవు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు