పోలీస్ స్టేషన్ నుండి రికవరీ బంగారం, సర్వీస్ తుపాకీ మిస్సింగ్.. ఎస్ఐ అరెస్ట్

అంబర్‌పేట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.పోలీస్ స్టేషన్ నుండి రికవరీ బంగారం, సర్వీస్ తుపాకీ మిస్సింగ్ అవటంతో అందుకు బాధ్యుడైన ఎస్ఐను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే,హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్లో దొంగల నుండి రికవరీ చేసిన బంగారంతో పాటు, సర్వీస్ తుపాకీ కనిపించకుండా పోవడంతో, ఎస్ఐ భాను ప్రకాష్ పై కేసు నమోదు చేసిన టాస్క్‌ఫొర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు ఎస్సై తన వ్యక్తిగత అవసరాల కోసం బంగారం, తుపాకీ తాకట్టు పెట్టి ఉంటాడని, మిగతా వివరాలు విచారణలో బయటపడతాయని ఉన్నతాధికారులు తెలియజేశారు. బెట్టింగ్లకు బానిసై రికవరీ బంగారాన్ని దొంగిలించిన ఎస్ఐ భాను ప్రకాశ్ పెద్ద మొత్తంలో అప్పులపాలయ్యాడని,ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కి అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో రికవరీ చేసుకున్న బంగారంలో ఐదు తులాలు దొంగిలించి వాడుకున్నట్టు, పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు