ఎచ్చెర్ల సమీపంలో సముద్రతీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం, మూసవానిపేట సముద్రతీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బోటు కొట్టుకొచ్చింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి దారి తప్పిన 13 మంది మత్స్యకారులు అందులో ఉన్నారు.

ఆహారంతో పాటు, బోట్ లో ఇంధనం లేక వారం రోజులకు పైగా సముద్రంలోనే ఉండిపోయిన వారిని స్థానికులు, మెరైన్ పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మూడు బోట్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామని మెరైన్ సీఐ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram