అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా….

భద్రాచలం పంచాయితీని అభివృద్ధి చేయటంతో పాటు అంబేద్కర్ భవన్ నిర్మాణం పూర్తి చేస్తా..

•అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మూడు రోజుల నిరాహార దీక్ష చేసి నిధులు సాధించా.

•చిత్తశుద్ధి లేని పార్టీల వల్ల పనులు నిలిచిపోయాయి.

•అవకాశం ఇవ్వండి, నిర్మాణం పూర్తి చేసి చూపిస్తా..సర్పంచ్ అభ్యర్థి
పూనెం ప్రదీప్ కుమార్ హామీ.

భద్రాచలం: డిసెంబర్ 1:

భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీ లో గత 25 సంవత్సరాల నుండి ఎటువంటి పురోగతి లేకుండా పడి ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఒక్క సంవత్సరం లోపు పూర్తి చేసి భద్రాచలం ప్రజలకు అందజేస్తానని భద్రాచలం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పూనెం ప్రదీప్ కుమార్ హామీ ఇచ్చారు. సుమారు 25 సంవత్సరాల క్రితం నుండి ఖాళీగా ఉన్న స్థలంలో సున్నం రాజయ్య భద్రాచలం శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ ప్రాంతంలో తాను, అల్లాడి పౌల్ రాజు, కొంతమంది మిత్రులతో కలిసి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి సున్నం రాజయ్యకు వినతిపత్రం అందించడం జరిగిందని, దానికి స్పందించిన సున్నం రాజయ్య అసెంబ్లీలో ప్రస్తావించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియం అండ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. అయితే అప్పటినుండి అనేక ఆటుపోట్ల మధ్య కమ్యూనిటీ హాల్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయి ఉండడం బాధాకరమన్నారు. అనేకమంది అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ భవన్ ను పూర్తి చేయమని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించినట్లయితే ఒక సంవత్సరంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం అసంపూర్తిగా ఉండి భారతరత్న, బాబాసాహెబ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం కలిగేలా ఉందన్నారు. ఓటు వేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ మీకు అందుబాటులోకి తీసుకువచ్చి అతి తక్కువ ఖర్చులో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram