అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం…

తెలంగాణలో మరోసారి అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.కాగా గతవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.. ఇలా ఉండగా ఆన్ని అవాంతరాలను దాటుకొని అఖండ2 సినిమా 12న విడుదల కానుంది.అయితే విడుదలకు ముందు రోజు డిసెంబర్ 11న రాత్రి 8 గంటల షోకు పర్మిషన్ తీసుకున్నారు..ఆ షో టికెట్ రేట్ రూ.600 గా నిర్ణయించారు. 12 వ తేదీ విడుదలైన రోజు నుండి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. కాగా ఆ కండిషన్ ప్రకారం 20 శాతం అఖండ2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram