డబ్బులు తిరిగి ఇవ్వమంటూ అసభ్యంగా ప్రవర్తించాడు…స్వతంత్ర అభ్యర్థి పై మహిళల ఆగ్రహం…

భద్రాచలం పట్టణంలోని 14 వ వార్డు నుండి పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి గురువారం నాడు జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తనకు ఓటు వేయలేదని,అందువల్ల తాను ఓటమి చెందానని, కాబట్టి తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దౌర్జన్యంగా మహిళలని అసభ్యకరంగా బూతులు తిట్టి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళినట్టు ఆరోపిస్తున్నారు..

కాగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చామని ,అయినా మహిళలు అని కూడా చూడకుండా తమను అసభ్యంగా తిట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని మీద చర్యలు తీసుకోవాలని, తమను దూషించిన సదరు అభ్యర్థి తమకు క్షమాపణ చెప్పాలని 14వ వార్డుకు చెందిన మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share