కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వెనిజులా ప్రెసిడెంట్ అమెరికా అదుపులో…

న్యూయార్క్…వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రత్యేక దళాలు కారకాస్‌లో అరెస్ట్ చేసి, న్యూయార్క్‌కు తీసుకొచ్చాయి. చేతులకు సంకెళ్లతో DEA కేంద్రానికి తరలిస్తుండగా, మదురో అక్కడి వారికి ప్రశాంతంగా “నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలపడం గమనార్హం. మరో వైపు వెనిజువెలా అధ్యక్షుడు మదురో తమ వద్ద బందీగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ఫోటోను విడుదల చేశారు…

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం కేసుల్లో విచారణ ఎదుర్కోనున్న మదురోను ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఈ చారిత్రాత్మక అరెస్టుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇది ఇలా ఉండగా వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ నేపథ్యంలో ప్రతిపక్ష నేత మరియా మచాడోపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరియా మంచి మహిళ అయినప్పటికీ, ఆమెకు ప్రజల మద్దతు, గౌరవం తక్కువగా ఉందని, అందుకే నాయకురాలిగా కొనసాగడం కష్టమని ఆయన పేర్కొన్నారు. మదురో అరెస్ట్ ఆపరేషన్ అర్ధరాత్రి జరగడం వల్ల ఆమెతో మాట్లాడలేకపోయానని వివరించారు. కాగా గతేడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మరియా ప్రస్తుతం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు