శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  అర్హులైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు తరగతి ప్రవేశాలకు ఆహ్వానం. : ఐ టి డి ఏ పి బి రాహుల్.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 21
టుడే 9 ప్రతినిధి

2026-27 విద్యా సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్ధులకు 3, 5 & 8 వ తరగతులలో ప్రవేశము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి పథకం నందు 3 వ తరగతి కి (78) సీట్లు, 5 వ తరగతి కి (39) సీట్లు, మరియు 8వ తరగతి కి (39) సీట్లు, మొత్తం సీట్లు (156) కలవని, ఇట్టి ప్రవేశంనకు ధరఖాస్తు ఫారములు సహాయ గిరిజన సంక్షేమ అధికారి దమ్మపేట, భద్రాచలం, ఇల్లందు, కార్యాలయంల నుండి DD(TW), ITDA, భద్రాచలం కార్యాలయం నుండి పొందవచ్చునని, ఇట్టి ఫారంనకు విద్యార్థి యొక్క కులం, నివాసం తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000/- లోపు గ్రామీణ ప్రాంతాలు రూ.2,00,000/- లోపు పట్టణ ప్రాంతాల వారు కలిగి ఉన్న వార్షిక (మీ సేవ) ద్రవీకరణ పత్రాలు ధరఖాస్తుకి జత పరచి 07.05.2026 లోపు ఉపసంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు సమర్పించవలెనని,ఇట్టి ప్రవేశమునకు ఎంపిక లాటరీ పద్ధతిలో ది.14.05.2026 న ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు నిర్వహించబడునని ఆయన అన్నారు.
కావున, ఆసక్తి గల గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పైన తెలిపిన గడువు తేదీ లోపు ధరఖాస్తు లను గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ. భద్రాచలం కార్యాలయం నందు మాత్రమే సమర్పించవలెనని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు