ఢిల్లీలో ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కుమార్తె హత్యాచార ఘటన: వెలుగులోకి నిందితుడి వరుస ఘాతుకాలు.. రాజస్థాన్‌లోనూ మరో మహిళపై అత్యాచారం!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమర్ కాలనీలో నివసించే ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన బాధితురాలు బుధవారం ఉదయం తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. గతంలో వారి ఇంట్లో పనిచేసిన రాహుల్ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్లిన సమయాన్ని చూసి, నిందితుడు టెర్రస్‌పై ఉన్న ఆమె గదిలోకి చొరబడి అత్యాచారం చేసి, అనంతరం మొబైల్ ఫోన్ కేబుల్‌తో గొంతు నులిమి చంపేశాడు.

విచారణలో నిందితుడికి సంబంధించిన మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీలో ఈ దారుణానికి ఒడిగట్టడానికి కేవలం కొన్ని గంటల ముందే, రాజస్థాన్‌లోని అల్వార్‌లో తన స్నేహితుడి భార్యపై రాహుల్ అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఆమెను కూడా చంపడానికి ప్రయత్నించి, ఆపై బెదిరించి తప్పించుకున్నాడు. అల్వార్ నుంచి అంబులెన్స్‌లో ఢిల్లీకి చేరుకుని నేరుగా ఐఆర్‌ఎస్ అధికారి ఇంటికి వెళ్లాడని దర్యాప్తులో తేలింది. అల్వార్ మరియు ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ కేసులపై సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడు రాహుల్ దారుణానికి పాల్పడటమే కాకుండా ఆ ఇంటి నుండి సుమారు రూ. 2.5 లక్షల నగదును కూడా దొంగిలించినట్లు జేసీపీ విజయ్ కుమార్ తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో తగినంత భద్రత ఉన్నప్పటికీ, నిందితుడికి ఆ ఇంటి నిర్మాణశైలి మరియు భద్రతా కోడ్లపై అవగాహన ఉండటంతో సులభంగా లోపలికి ప్రవేశించగలిగాడు. బాధితురాలు ఉన్న గదికి చేరుకోవడానికి నాలుగు తాళాలు తెరవాల్సి ఉన్నప్పటికీ నిందితుడు లోపలికి వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు