కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  అమరావతి పనులకు డీజిల్: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్.. బల్క్ సరఫరాకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న డీజిల్ కొరత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా రిటైల్ బంకుల ద్వారా బల్క్‌గా డీజిల్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రిటైల్ బంకుల నుంచి బల్క్ సరఫరా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.

గత మూడు రోజులుగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. స్టాక్ లేక చాలా బంకులు మూతపడగా, తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజధాని పనులకు ఇబ్బంది కలగకుండా డీజిల్ కోటాను పెంచాలని ఏపీ సీఎస్ ద్వారా కేంద్రానికి లేఖ రాయగా, రిటైల్ బంకుల్లో బల్క్ సరఫరాకు కేంద్రం ససేమిరా అనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడినట్లయింది.

కాగా, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా సుమారు రూ.150 కోట్ల డీజిల్ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించింది. బల్క్‌లో రూ.153 గా ఉన్న డీజిల్‌ను, రిటైల్ బంకుల్లో రూ.98కే ఇప్పిస్తూ కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించింది. రైతులకు, సామాన్యులకు ఇంధనం దొరకకుండా చేసి, రాష్ట్రంలో ఈ కృత్రిమ చమురు కొరతను చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు