కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  వినాశకాలే విపరీత బుద్ధి: పెట్రోల్ బంకులో బైక్ స్టంట్లపై సీపీ సజ్జనార్ ఫైర్

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సీపీ వీసీ సజ్జనార్, తాజాగా ఓ యువకుడి బైక్ స్టంట్ వీడియోను షేర్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ బంకులో ఉన్న అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు ఓ యువకుడు అత్యుత్సాహంతో బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్లు చేసి భంగపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ట్విట్టర్‌లో పంచుకున్న సీపీ సజ్జనార్.. “వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు” అంటూ యువత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అత్యంత ప్రమాదకరమైన పెట్రోల్ బంకు లాంటి ప్రదేశాల్లో ఇలాంటి స్టంట్లు చేయడం ఏమాత్రం సాహసం కాదని, అది పచ్చి మూర్ఖత్వమని ఆయన హెచ్చరించారు. కేవలం ఒక క్షణం బిల్డప్ కోసం అమాయక ప్రజల ప్రాణాలను బలిచేయకూడదని సూచించారు. “మీరు చేసే వీలింగ్స్.. మీ కోసం ఇంట్లో ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీళ్లు మిగల్చకూడదు, బాధ్యతగా ఉండండి” అంటూ యువతకు హితవు పలికారు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో.. యువకుడు తన బైక్ ముందు టైర్‌ను గాలిలోకి లేపగా, అది బ్యాలెన్స్ తప్పి ముందున్న వ్యక్తికి బలంగా తగిలింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి, స్టంట్ చేసిన యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. అక్కడున్న వారు కూడా అతడిని తీవ్రంగా మందలించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా, పరువుతో పాటు చెంపదెబ్బ కూడా ఫ్రీగా వచ్చిందంటూ నెటిజన్లు ఆ యువకుడిపై సెటైర్లు వేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు