టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు: 19 పేజీల సూసైడ్ నోట్‌లో భార్య అరాచకాలు

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. తాను ప్రాణాలు తీసుకునే ముందు సోషల్ మీడియా స్టేటస్‌లో పెట్టిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తన భార్యకు పెళ్లికి ముందు ఆరు ప్రేమ కథలు ఉన్నాయని, వివాహం తర్వాత కూడా ముగ్గురితో వివాహేతర సంబంధాలు కొనసాగించిందని సీతారాం ఆ లేఖలో ఆరోపించారు. ఆమె తన ప్రియుడితో ఉన్న అసభ్యకర వీడియోలను స్వయంగా అతడికే పంపడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆయన వాపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాల యువతిని 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య ప్రవర్తన వల్ల ఎన్ని అవమానాలు ఎదురైనా, పిల్లల కోసం ఆమెను మార్చుకోవాలని సీతారాం ప్రయత్నించారు. ఒకానొక దశలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా అన్నీ మరిచిపోయి రెండు నెలల తర్వాత మళ్లీ ఇంటికి తీసుకువచ్చారు. అయితే, భార్య మళ్లీ పాత అలవాట్లతో ప్రియుడి కోసం వెతుకులాడటం, చిన్న కుమారుడిని ఇంట్లోనే వదిలేసి ఎనిమిది రోజుల పాటు ఇంటికి రాకపోవడంతో సీతారాం తట్టుకోలేకపోయారు.

చివరగా భార్య చేసిన నమ్మకద్రోహాన్ని భరించలేక హుస్సేన్ సాగర్‌లో దూకి సీతారాం ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు భార్యతో పాటు ఆమె ప్రియుడు రమణా రెడ్డి కూడా కారణమని లేఖలో పేర్కొన్నారు. అయితే సీతారాం చనిపోయి మూడు నెలలు గడుస్తున్నా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రియుడితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం వంటి దారుణాలన్నీ సీతారాం రాసిన లేఖ ద్వారా బయటకు రావడంతో ఈ కేసుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు