వైభవంగా గోదావరి నది హారతి…

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో :భద్రాచలం: మే3
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం ప్రజల భక్తుల ఆదరాభిమానాలతో గోదావరి మాత నదిహారతి పురోహితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని రామ వజ్జల రవికుమార్ అన్నారు. ఆదివారం నాడు పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం విదియనాడు శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశాలలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయములో జరిగిన నదీహారతి కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో వైశాఖమాసం శుక్లపక్షం విదియ సందర్భంగా సాయంత్రం 6:30 గంటలకు జైశ్రీరామయ నమః అని శ్రీరామ స్మరణతో గోదావరి నదికి భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు.
అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులు
శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామాను గ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు.
అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, రామాచార్యులు, తేజ ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం, నైవేద్యం, శనగలు భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి శ్రీ రాఘవేంద్ర బట్టల షాప్ భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు.
అంతకుముందు బూర్గంపాడు మండలం సారపాక శ్రీ చైతన్య పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విహారిక క్లాసికల్ డాన్స్ ను ప్రేక్షకులు వీక్షించి ఆనందించారు.
ఈ కార్యక్రమంలో పురోహితులు పవన్ కుమార్ శర్మ, కారంబరీ కృష్ణ శర్మ, రామాచార్యులు, ఫణి కుమార్ శర్మ, సత్య ప్రసాద్ శర్మ, తేజ శర్మ, స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు