మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల వాహనానికి పోలీసులు వీఐపీ తరహాలో ఎస్కార్ట్ నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజులుగా జిల్లాలో నెలకొన్న తీవ్రమైన ఎల్పీజీ కొరత కారణంగా, గ్యాస్ లారీ రాగానే ప్రజలు ఎగబడతారనే ఆందోళనతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద ముప్పారం, వంతడుపుల వంటి గ్రామాల్లో సిలిండర్ దొరకడం గగనమవ్వడంతో, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.
గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నర్సింహులపేటలోని గ్యాస్ గోదాం వద్ద వందలాది మంది మహిళలు, వృద్ధులు రాత్రంతా జాగారం చేస్తూ రోడ్లపైనే పడిగాపులు కాశారు. సిలిండర్ల వాహనం రాక ఆలస్యం కావడంతో ఆగ్రహించిన వినియోగదారులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి వెంటనే లోడ్ తెప్పించి, బారికేడ్ల మధ్య పంపిణీని పూర్తి చేయించారు.
మరోవైపు, గ్యాస్ కంపెనీలు సరఫరాలో లోటు లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొరత ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తూ,









