ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలి…..

  • ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలి.
  • కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో బంద్ కరపత్రాల ఆవిష్కరణ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 16
టుడే 9 ప్రతినిధి

రోగులకు అవసరమైన ఔషధాలను విక్రయించే విధానంలో ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని భద్రాచలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పరిమి సోమశేఖర్ డిమాండ్ చేశారు
శనివారం స్థానిక జీయర్ మఠం లో దేశవ్యాప్త బంద్ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ప్రభావితం చేస్తున్న పలు సమస్యలపై ఇప్పటికే విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ ఫార్మసీ విక్రయాల ద్వారా ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను అడ్డుపెట్టుకొని నకిలీ ప్రిస్క్రిప్షన్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని హెచ్చరించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరినా స్పందించడం లేదని ఆరోపించారు.
​కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడమే కాకుండా, దేశంలో ఈ ఫార్మసీ విధానాన్ని పూర్తి గా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి నాగేశ్వరావు మాట్లాడుతూ మందుల దుకాణాల యజమానుల సమస్యలపై ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా బంద్‌లో భాగంగా భద్రాచలం లో కూడా దుకాణాలను బంద్ చేసి, విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ షాపుల యజమానులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు