రష్మిక నోట దొర్లిన ‘బూతు’ పదం.. వెంటనే క్షమాపణలు, ఈవెంట్‌లో అన్‌కంఫర్టబుల్ ఫీలైన నేషనల్ క్రష్!

ఈవెంట్‌లో రష్మిక నోట స్లాంగ్ వర్డ్: బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘కాక్ టెయిల్ 2’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నోట ఓ బూతు పదం దొర్లడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబయిలో జరిగిన ఈ మ్యూజికల్ ఈవెంట్‌లో సహనటి కృతి సనన్‌ను ప్రశంసించే క్రమంలో రష్మిక తీవ్రమైన ఎగ్జైట్‌మెంట్‌కు లోనయ్యారు. “నువ్వు చాలా హాట్, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.. నువ్వు F*** హాట్” అంటూ ఓ స్లాంగ్ వర్డ్‌ను ఉపయోగించారు. అయితే వెనువెంటనే తేరుకున్న రష్మిక.. నాలుక కరుచుకుని క్షమాపణలు (సారీ) చెప్పారు. కృతి అమేజింగ్‌గా ఉందనే ఉద్దేశంతోనే అలా అన్నానని చెబుతూ ఆమెను హగ్ చేసుకోగా, వేదికపై ఉన్న షాహిద్ కపూర్, కృతి సనన్‌లు ఒక్కసారిగా నవ్వేశారు.

షాహిద్ కపూర్ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డారా?: ఇదే ఈవెంట్‌లో రష్మిక మందన్న కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైనట్లు కనిపించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రష్మిక మైక్‌లో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశారు. దీంతో రష్మిక ఒక్కసారిగా ఇబ్బంది పడినట్లు కనిపించింది. పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ, ఆమె వెంటనే కాస్త పక్కకు తప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు.. రష్మిక స్పష్టంగా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైందని, అలా బహిరంగ వేదికలపై హీరోలు ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ షాహిద్ కపూర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

జూన్ 19న థియేటర్లలోకి ‘కాక్ టెయిల్ 2’: 2012లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘కాక్ టెయిల్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ‘కాక్ టెయిల్ 2’ తెరకెక్కుతోంది. హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదొక వినూత్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, ఇందులో కృతి, రష్మికలు స్వలింగ సంపర్కులుగా కనిపించనున్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో బలంగా సాగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు