స్కానింగ్ సెంటర్ల పై ఆకస్మికతనికి పాల్గొన్న డాక్టర్ హరీష్….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
చర్ల మే 18
టుడే 9 ప్రతినిధి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం
ఈరోజు అనగా 18-5-2026న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆదేశానుసారం, పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో చర్ల మండలంలోని స్కానింగ్ సెంటర్లు. ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రుల యాజమాన్యాలకు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా పొందిన తర్వాతే ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్లు నిర్వహించాలని సూచించారు.
తనిఖీలలో భాగంగా సాగర్ హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్ లేకుండానే స్కానింగ్ మిషన్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై గ్రామపంచాయతీ పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో స్కానింగ్ మిషన్ ఉన్న గదిని సీజ్ చేయడం జరిగింది. సంబంధిత నివేదికను జిల్లా వైద్యాధికారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామదాస్, చర్ల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, గ్రామపంచాయతీ వీఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు