భద్రాచలం మే 21
టుడే 9 ప్రతి నిధి
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కునవరం రోడ్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మహానేతకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ ఉపసర్పంచ్ రత్నం కవిత. కాంగ్రెస్ పార్టీ నాయకులు.మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. “సమైక్యతే మన శక్తి – శాంతియుత భారతమే మన లక్ష్యం” అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, కొండిశెట్టి కృష్ణమూర్తి, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, అరికెల్ల తిరుపతి రావు, భీమవరపు వెంకటరెడ్డి, చుక్కా సుధాకర్, దుద్దుకురి సాయిబాబా, దరపునేని రాంబాబు, పడిసిరి శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, గుండెపెల్లి హనుమంతురావు, ఎండి భషీర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శి మాచినేని భాను, ఏలురి రాము , మహిళలు ములకలపల్లి మదారి తదితరులు పాల్గొన్నారు.









