భద్రాచలంలో కోర్టు విధుల సంపూర్ణ బహిష్కరణ…..

 

  • భద్రాచలంలో కోర్టు విధుల సంపూర్ణ బహిష్కరణ.
  • న్యాయవాది ఖాజా మోయిన్‌ఉద్దీన్ దారుణ హత్యపై బార్ అసోసియేషన్ తీవ్ర నిరసన.

భద్రాచలం, మే 25
టుడే 9 ప్రతినిధి

హైదరాబాద్‌లో న్యాయవాది ఖాజా మోయిన్‌ఉద్దీన్ పై జరిగిన దారుణ అమానుష హత్యను ఖండిస్తూ భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు విధుల సంపూర్ణ బహిష్కరణ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ పిలుపు మేరకు భద్రాచలం కోర్టు పరిధిలోని సీనియర్, జూనియర్ న్యాయవాదులందరూ ఉదయం నుంచే స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉండి, ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులంతా కోర్టు ప్రాంగణంలో సమావేశమై, అమరజీవి ఖాజా మోయిన్‌ఉద్దీన్ కి గీతాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి మాట్లాడుతూ. ఖాజా మోయిన్‌ఉద్దీన్ పై జరిగిన దారుణ హత్య యావత్ న్యాయవ్యవస్థకే తీరని లోటని, ఈ అమానుష ఘటనను బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు నిరంతరం శ్రమించే న్యాయవాదులపై ఇలాంటి పగటిపూట దాడులు జరగడం అత్యంత విచారకరమని, ఇది యావత్ సమాజ రక్షణకే ఒక పెద్ద సవాల్ అని ఆందోళన వ్యక్తం చేశారు.
సభలో వ్యక్తమైన తీవ్ర ఆందోళన ప్రకారం.దేశంలో మరియు రాష్ట్రంలో రోజురోజుకూ న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు హద్దుమీరిపోతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే న్యాయాన్ని రక్షించేవారే కరువవుతారని న్యాయవాద లోకం హెచ్చరించింది. న్యాయవాదులకు వృత్తిగత రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తక్షణమే అసెంబ్లీలో కఠినమైన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని’ ప్రవేశపెట్టి చట్టరూపం తీసుకురావాలని బార్ అసోసియేషన్ గట్టిగా డిమాండ్ చేసింది. లేనిపక్షంలో యావత్ రాష్ట్ర రాష్ట్ర న్యాయవాద లోకం ఏకమై విస్తృత స్థాయి పోరాటానికి వెనకాడబోమని స్పష్తీకరించింది . అదేవిధంగా ఈ హత్యకి కారకులైనటువంటి నేరస్తులను పరిక్యగతిన పట్టుకొని ఫాస్ట్ ట్రాక్కోడ్ ద్వారా విచారణ జరిపించి నేరస్తులకు ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది .
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ తాతా లలిత, సీనియర్ న్యాయవాదులు పేరాల వెంకటేశ్వర్లు, బండారు అరుణ్ చంద్, అవులూరి సత్యనారాయణ,భజన సతీష్, ఎంవి రమ, సాధన పల్లి సతీష్, పాయం రవివర్మ, ఎస్.మల్లేష్, దాట్ల సంధ్య, బి రామకృష్ణ,వి. రవితేజ,సౌజన్య, చందన, కొత్తపల్లి రాంబాబు, ఎం శ్రీనివాస్, అరవింద్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు