హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోండి గర్భాశయ కాన్సర్ నుండి విముక్తి పొందండి.:సర్పంచి పూనెం కృష్ణ.

భద్రాచలం మే 26 : టుడే 9 ప్రతినిధి

14 సంవత్సరాలు దాటిన బాలికలు తప్పనిసరిగా హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం వలన భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చునని అలాగే తల్లిదండ్రులు ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చినప్పుడే వివాహాలు చేయాలని భద్రాచలం సర్పంచ్ పూణేం కృష్ణ అన్నారు.
మంగళవారం దుమ్మగూడెం ప్రాజెక్ట్ పరిధిలోని భద్రాచలం సెక్టార్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల సందర్భంగా భద్రాచలం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిడిపిఓ జ్యోతితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పనిచేయుచున్న అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు చిన్నారులకు రక్తహీనత కలగకుండా న్యూట్రిషన్ ఫుడ్ సక్రమంగా అందించాలని, గర్భిణీ స్త్రీలకు సమయానుకూలంగా బాలామృతం అందజేసి పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉండేలా గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే పోషకాహార ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా గ్రామాలలో తెలియజేయాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకునేలా చూడాలని అన్నారు.
అనంతరం సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో ఎక్కువ శాతం బాల్య వివాహాలు చేస్తూ ఉంటారని వాటిని నిరోధించడానికి మా ప్రాజెక్టు తరుపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, యువతికి 18 సంవత్సరాలు, యువకుడికి 21 సంవత్సరాలు నిండితేనే వివాహాలు జరిపించాలని, మైనార్టీ తీరకముందు వివాహాలు జరిపిస్తే వివాహాలు జరిపిన వారికి పెళ్లి చేసిన పురోహితులకు మరియు ఆ గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకు ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని, గ్రామంలోని యువజన కార్యకర్తలు గ్రామములో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు మీ దృష్టికి వస్తే తప్పనిసరిగా ఐసిడిఎస్ కార్యాలయమునకు సంప్రదించి తెలియజేయాలని అలా రాని పక్షంలో 1098 నెంబర్కు ఫోన్ ద్వారా తెలియజేస్తే తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. అలాగే గ్రామంలోని యూత్ సంబంధించిన యువకులు మానవ అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు నీగా పెడుతూ ఉండాలని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన బాలికలు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు చంద్రకళ, అనసూయ బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు