గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) లోని తన క్యారెక్టర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో తాను పోషించిన పాత్ర తన కెరీర్‌లోనే పూర్తి భిన్నమైనదని, సరికొత్తదని ఆయన స్పష్టం చేశారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాతో చరణ్ ముచ్చటించారు. “పెద్ది సినిమాలో నేను చేసిన పాత్ర నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదు.. ఈ సినిమాలో చాలా మంది గొప్ప నటులతో కలిసి పనిచేయడం వల్ల ఒక నటుడిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది” అని రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ రామ్ చరణ్ నటన, అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాలో చరణ్ కేవలం నటుడిగానే కాకుండా.. ఒక అథ్లెట్‌గా మూడు రకాల విభిన్న క్రీడలను (కుస్తీ, క్రికెట్, రన్నింగ్) అత్యంత సహజంగా ప్రదర్శించారని తెలిపారు. ఇక వీటికి తోడు నాలుగో ‘ఆట’గా తనదైన సిగ్నేచర్ డ్యాన్స్‌తో చరణ్ థియేటర్లలో దుమ్మురేపడం ఖాయమని బొమన్ ఇరానీ పేర్కొన్నారు. సమాజంలో తన గుర్తింపు కోసం ఒక సాధారణ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లగలడనే బలమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ సినిమా నిరూపిస్తుందని, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సినిమా విడుదల తేదీ చాలా దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో మొదటి నుంచీ ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సన మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ భిన్నమైన లుక్, దానికి తోడు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









