పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు…

పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు…

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి.. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి వందేమాతరం, తెలంగాణ గీతాన్ని ఆలపించారు. పోలీసు దళాల గౌరవ వందనం అనంతరం పరేడ్‌లో కమాండింగ్ ఆఫీసర్ మనీషా నెహ్రా కత్తితో సీఎంకు సాంప్రదాయ స్వాగతం పలికి వాహనాన్ని ముందుకు నడిపించారు. రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్ గేట్‌వేగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా కాకుండా సేవగా భావించి పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మధ్యలోనే ముగించారు రేవంత్ రెడ్డి… ఎండ ఎక్కువగా ఉంది అందుకే మధ్యలోనే ఆపేస్తున్నా..లేకపోతే చాలా సేపు మాట్లాడేవాడిని అని అన్నారు సీఎం…

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు