- భద్రాచలం ఐ టి డి ఏ కు జాతీయ స్థాయి గుర్తింపు.
- 5 లక్షల రివార్డు అందుకున్నందుకు మీట్ కార్యక్రమం.
- పాల్గొన్న ఐ టీ డి ఏ అధికారులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం జూన్ 5
టుడే 9 ప్రతినిధి
ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది అందరం కలిసి మెలసి ఐకమత్యంగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి పనిచేయడం వలన అనుకున్నది సాధించి ఐ టి డి ఏ కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేశామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో భద్రాచలం ఐటిడిఏకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో పాటు న్యూఢిల్లీలో విజ్ఞాన భవనంలో జరిగిన కార్యక్రమంలో ఐదు లక్షల రూపాయల రివార్డు ప్రకటించి అందుకున్న సందర్భంగా 2024 నుండి 2026 వరకు సాధించిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొత్తం 214 ఐటీడీఏ లు గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్నాయని, ఈనెల మూడు నాడు క్షేత్రస్థాయి అధికారుల సమావేశం న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో జరిగినప్పుడు వివిధ రాష్ట్రాలు జిల్లాలు కలిపి 9 అవార్డులు ప్రకటించగా గిరిజన సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న మన భద్రాచలం ఐటిడిఏకు జాతీయస్థాయిలో ఉత్తమ ఐటీడీఏ గా అవార్డు ప్రకటించడం జరిగిందని అన్నారు. ఈ అవార్డు రావడానికి ప్రత్యేకంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో సహకరించడం వలన ఐటీడీఏ పీవో గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి గిరిజన సంక్షేమానికి నా వంతు సేవలు అందించాలని దృక్పథంతో ముఖ్యంగా గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి సారించానని, అందుకు గిరిజన విద్యను పునాది నుండి విద్యార్థులను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, మంచి ఫలితాలు వచ్చాయని అలాగే పదవ తరగతి అయిన తర్వాత గిరిజన విద్యార్థులు వారు అనుకున్నది సాధించడానికి వివిధ శాఖల అధికారులతో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని దాంట్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.

ఈ సంవత్సరం వినూత్న రీతిలో ఉద్దీపకం వర్క్ బుక్ తో పాటు కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన అంశాలు ప్రాక్టికల్గా పిల్లల చేత చేయించడానికి ప్రణాళికల రూపొందిస్తున్నానని అన్నారు. అలాగే అధికారుల అందరి పర్యవేక్షణ వలన ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు 93% సాధించడం జరిగిందని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా మ్యూజియం రూపకల్పన చేయడానికి నా యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని గిరిజన సంస్కృతిని ప్రాచుర్యంలోకి తేవడానికి అహర్నిశలు కృషి చేశానని నాతోపాటు అందరూ అధికారులు, క్రింది స్థాయి సిబ్బంది సహకరించడం వలన మ్యూజియం సర్వ సుందరంగా తయారు చేయడం వలన రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇంత గుర్తింపు రావడానికి మనమందరం ప్రణాళిక ప్రకారము పనిచేయడం వలన సాధ్యమైందని అన్నారు. భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేయడానికి యూనిట్ అధికారుల సహాయ సహకారాల వలన అనుకున్న ఫలితాలు సాధించడమే కాక 70 మంది చిన్నతరహా పరిశ్రమలు నడుపుకునే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. అలాగే గిరిజనుల కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకాన్ని తయారు చేయడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిందని అయినా ఆదివాసి గిరిజనుల సహాయ సహకారాల వలన కోయ విలువేల్పుల చరిత్ర పుస్తకాన్ని కూడా రూపొందించడం జరిగిందని అన్నారు.

గిరిజన సంక్షేమానికి మరియు గిరిజన విద్యార్థినీ విద్యార్థుల గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రకాల గ్రూప్ శిక్షణ అందించడానికి ఐ టి సి నవభారత సంస్థలు సహకరించడంతో విద్యార్థినీ విద్యార్థులకు 25 లాప్టాప్ లు అందించడం జరిగిందని ఇంకా 15 లాప్టాప్ లు, సి ఎస్ ఆర్ నిధుల ద్వారా నాలుగు ఎస్ ఓ ఈ కళాశాలలకు కంప్యూటర్స్ సరఫరా కొరకు నివేదికల రూపొందించామని అన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా విద్యతో పాటు వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, గిరిజనులకు వైద్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఎక్విప్మెంట్ సమకూరుస్తామని అన్నారు.ఇంజనీరింగ్ శాఖ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు డైనింగ్ హాల్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్ ఉండేలా చర్యలు చేపడతామని, అత్యధిక శాతం క్రీడాకారులు ఉన్న భద్రాచలంలో మినీ స్టేడియం పర్మినెంట్గా నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
ఇదే స్ఫూర్తితో అధికారులు సిబ్బంది అందరం కలిసికట్టుగా మన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి గిరిజనులకు మన వంతు సహాయ సహకారాలు అందించి ఐటీడీఏకు జాతీయస్థాయిలో వచ్చిన గుర్తింపును చిరస్థాయిలో నిలిచిపోయేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం యూనిట్ అధికారులు సిబ్బంది అందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం యూనిట్ అధికారులు సిబ్బంది పిఓను ఘనంగా సన్మానించి వికాస రథసారథి బిరుదు అంకితం చేస్తూ జ్ఞాపికను అందించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి,ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఐటీసీ జిఎం చంగల్ రావు, ఎల్ టి ఆర్ డి టి మనిధర్ ,ఏవో సున్నం రాంబాబు, ఏపీవో పవర్ వేణు, ఏటీడీవో అశోక్ కుమార్, ఏ సీఎంవో రమేష్, ఏ డిఎంహెచ్వో సైదులు, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ ఐటిడిఏ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









