కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ‘పెద్ది’ సక్సెస్‌పై అల్లు అర్జున్ పోస్ట్.. రామ్ చరణ్ క్రేజీ రిప్లై!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ విలేజ్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను, విమర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన బ్రదర్ రామ్ చరణ్‌కు, చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. బన్నీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.

నీ విషెస్ నాకు ఎంతో ప్రత్యేకం: రామ్ చరణ్

తాజాగా అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌పై రామ్ చరణ్ ఎంతో క్రేజీగా స్పందించారు. బన్నీ విషెస్‌ను రీ-షేర్ చేస్తూ.. “నీ అభినందనలు నాకు, అలాగే మా మొత్తం ‘పెద్ది’ టీమ్‌కు ఎంతో ప్రత్యేకం బన్నీ.. థాంక్యూ సో మచ్” అంటూ తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చరణ్ ఈ సందర్భంగా ట్వీట్ చేయడం విశేషం.

ఇండస్ట్రీలో హెల్తీ ట్రెండ్.. ఖుషీలో ఫ్యాన్స్

టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ స్టార్ హీరోలు ఇలా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ, సినిమాలను ప్రమోట్ చేసుకోవడంపై సినీ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ పోటీని పక్కన పెట్టి హీరోల మధ్య ఉన్న ఈ హెల్తీ బాండింగ్ ఇండస్ట్రీకి ఎంతో మంచిదని అభిప్రాయపడుతున్నారు. హీరోలిద్దరి సోషల్ మీడియా సంభాషణలు చూసి అటు మెగా అభిమానులు, ఇటు అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు