భద్రాచలం జూన్ 15
టుడే 9 ప్రతినిధి
100 డేస్ టీబీసీ క్యాంపియన్
0.2 భాగంగా భద్రాచలం టిబి యూనిట్ ఏ ఏ యం కంబాలపాడు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ క్యాంపు లో క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాల నుంచి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గటం, రాత్రి చెమటలు పట్టడం, దగ్గినప్పుడు తెమడ పడటం ఉన్నట్లయితే క్షయ వ్యాధి నిర్ధారణ కోసం తెమడ పరీక్ష, ఎక్స్రే పరీక్ష చేసిన తర్వాత నిర్ధారణ జరిగాక ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధిని నివారించవచ్చునని తెలియజేశారు. సోమయ్య ఏ సి యస్ యం కోఆర్డినేటర్స్ మాట్లాడుతూ క్షయ వ్యాధి పేషెంట్ మందులు వాడుతున్నంత కాలం వెయ్యి రూపాయలు నిక్షయ పోషణ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా పేషంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి అనుమానితుల వద్ద నుండి తెమడ శాంపిల్స్ సేకరించడం జరిగింది. అత్యంత ఆధునికరమైనటువంటి హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే ద్వారా ఛాతి ఎక్స్రే పరీక్ష నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిఖిల్ కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ పావని రెడ్డి, డీపీసీ , చో , హెయో , STS ,MLHP, ANM, టిబి అలర్ట్ ఇండియా ఎన్జీవో X-ray technician, సెక్యూర్ ఎన్జీవోస్ , TBHV,STLS ఆశాలు employees హాజరగుట జరిగింది.









