పశువుల లంపీ స్కిన్, మానవుల మంకీపాక్స్, మశూచి వంటి పాక్స్ వైరస్‌లపై ప్రభావం చూపగల ఔషధాన్ని గుర్తించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు

హైదరాబాద్ ఐఐసీటీ శాస్త్రవేత్తలు పశువుల లంపీ స్కిన్, మానవుల మంకీపాక్స్, మశూచి వంటి పాక్స్ వైరస్‌లపై ప్రభావం చూపగల ఔషధాన్ని గుర్తించారు. క్యాన్సర్ చికిత్సకు వాడే ‘లాపటినిబ్’ మందు వైరస్ ప్రోటీన్ LSTKను అడ్డుకుని వృద్ధిని ఆపుతుందని AI సహాయంతో విశ్లేషణలో తేలింది. ఇప్పటికే FDA ఆమోదం ఉన్న 88 కైనేస్ నిరోధక మందులను పరీక్షించగా లాపటినిబ్ అత్యంత సమర్థంగా పనిచేస్తుందని కంప్యూటర్ ఆధారిత అధ్యయనంలో తేలింది. తదుపరి దశలో ప్రయోగశాల పరీక్షల ద్వారా దీని ప్రభావాన్ని నిర్ధారిస్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు