యాసంగి సీజన్ తర్వాత తెలంగాణలో 74.8 లక్షల ఎకరాల్లో కోతలు జరగగా, 16.85 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను రైతులు దహనం చేశారని వ్యవసాయ వర్సిటీ రిమోట్ సెన్సింగ్ సర్వేలో తేలింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. దహనం వల్ల 23.63 లక్షల కిలోల నత్రజని, 11.9 లక్షల కిలోల భాస్వరం, 1062 లక్షల కిలోల పొటాష్‌తో పాటు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలిలో కలిశాయి. దీంతో నేల ఆరోగ్యం, గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది.
Post Views: 7









