నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో బాహుబలి ఫ్రాంచైజీ నుండి మూడో భాగం (బాహుబలి 3) రాబోతుందనే బలమైన సంకేతాలను హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి పరోక్షంగా ఇచ్చారు. రానా మాట్లాడుతూ.. “దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఇక్కడ లేరు కాబట్టి అసలు విషయం చెబుతున్నా, ప్రపంచం సిద్ధంగా లేకపోయినా బాహుబలి మాత్రం ఉంటుంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే ప్రభాస్ నవ్వుతూ తన మూడు వేళ్లను చూపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విజన్‌తో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. 2015లో ప్రారంభమైన ఈ ఫాంటసీ గాథలో ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా విలనిజం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. 2017లో విడుదలైన ‘బాహుబలి 2’ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,788 కోట్ల వసూళ్లతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజీ నుండి యానిమేషన్ సిరీస్‌లతో పాటు ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే సరికొత్త సీజీఐ (CGI) యానిమేషన్ ప్రాజెక్ట్ కూడా సిద్ధమవుతోంది.
ఈ డాక్యుమెంటరీ క్లిప్‌లో స్వయంగా ప్రభాస్ ఇచ్చిన హింట్‌తో సినిమా దాదాపు ఖరారైనట్లేనని నెటిజన్లు మరియు అభిమానులు సామాజిక మాధ్యమాలలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ తిరిగి రాబోతుందంటూ, రాజమౌళి ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ప్రసారమవుతున్న ఈ డాక్యుమెంటరీలో తెరవెనుక నటీనటుల శ్రమను, అద్భుత విశేషాలను చూపించగా, గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాల మధ్య ‘బాహుబలి 3’ అధికారిక ప్రకటన కోసం సినీ ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది.









