డాక్టర్ల పనితీరుపై ప్రత్యేక సమావేశం….

  • డాక్టర్ల పనితీరుపై ప్రత్యేక సమావేశం.
  • వైద్యాధికారులు వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలి.
  • ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 29
టుడే 9 ప్రతినిధి

మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాలలో గిరిజనులకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యశాఖ అధికారులు సిబ్బంది తమ వీధులు సక్రమంగా నిర్వహించాలని గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
సోమవారం నాడు సాయంత్రం మారుమూల ప్రాంత పీహెచ్సీలలో డాక్టర్ల యొక్క పనితీరు. గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలలో గర్భిణీ స్త్రీలతో పాటు అలాగే క్యాన్సర్ టీబీ రోగులకు అందుచున్న వైద్య సేవలకు సంబంధించిన పూర్తి స్థాయి డాటా సంబంధిత పీహెచ్సీలలో ఉండడంతోపాటు వైద్యాధికారికి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండాలని అలాగే డెలివరీకి సమయం దగ్గర పడుతున్న గర్భిణీలకు ఎప్పటికప్పుడు వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని అన్నారు. పీహెచ్ సీ కి వచ్చే గర్భిణీలకు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని నార్మల్ డెలివరీల శాతం పెరగాలని అన్నారు. ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సూపర్వైజర్లు పనితీరు మార్చుకొని వారి పరిధిలోని ఏరియాలలో సక్రమంగా విధులు నిర్వహించాలని నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో కు ఆదేశించారు. మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలలో వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలలో గర్భిణీ స్త్రీలు కనుక ఉంటే నెలల ముందుగానే వారిని బర్త్ వేటింగ్ హాల్ కి రెఫర్ చేసి వారికి డెలివరీ అయ్యే వరకు వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతి గ్రామంలో టీబీ ఆయుష్మాన్ భవ శిబిరాలు పెట్టి ప్రతి ఒక్కరినీ టెస్టులు నిర్వహించాలని. 108,102 వాహనాలు గిరిజనులకు సేవలు అందించడానికి కేటాయించినందున ముఖ్యంగా డెలివరీకి దగ్గర ఉన్న మహిళల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వారిని సకాలంలో సంబంధిత పీహెచ్సీ కి చేరవేయాలని అన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారిని భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఎన్ ఆర్ సి కి తరలించాలని అందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిఎంహెచ్వో తుకారం రాథోడ్, డి సి హెచ్ ఎస్ రవిబాబు, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీధర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శరత్, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రాజశేఖర్ మరియు మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు