బ్రేక్‌అప్‌లపై జెన్నిఫర్ లోపెజ్ ఆసక్తికర వ్యాఖ్యలు: విడిపోయినప్పుడు బాధపడకుండా పార్టీ చేసుకోవాలి!

ప్రముఖ హాలీవుడ్ నటి, పాప్ గాయని జెన్నిఫర్ లోపెజ్ తన విఫల ప్రేమ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రేక్‌-అప్‌లను ఎవరూ జీవిత వైఫల్యాలుగా పరిగణించకూడదని, వాటిని ఒక వ్యక్తిగత ఎదుగుదలకు లభించిన అద్భుతమైన అవకాశాలుగా చూడాలని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల కరీమ్ రహ్మా హోస్ట్ చేసిన ‘సబ్వే టేక్స్’ అనే ఇంటర్నెట్ టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా ఆమె తన జీవిత అనుభవాలకు సంబంధించిన ఈ ఆసక్తికరమైన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు.

న్యూయార్క్ సబ్వేలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో 56 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ.. బ్రేక్‌ అప్‌లు అనేవి జీవితాన్ని ముగించేవి కావు, నిజానికి మనల్ని మనం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి అవొక లాంచ్‌ప్యాడ్ వంటివని అభివర్ణించారు. ఎవరైనా భాగస్వాములు విడిపోయినప్పుడు విచారంగా కూర్చోకుండా ‘మీరు విడిపోయారా? కంగ్రాట్స్’ అంటూ పార్టీ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే, ఆ విడిపోవడం అనేది ఆ ఇద్దరు వ్యక్తుల భవిష్యత్తు శ్రేయస్సు కోసం తీసుకున్న అత్యంత సరైన నిర్ణయం కావచ్చని ఆమె వివరించారు.

తన జీవితంలో ఎదురైన రకరకాల మానసిక సవాళ్లు, ఒడిదుడుకుల నుంచే తాను వైయుక్తికంగా అత్యధికంగా విషయాలు నేర్చుకున్నానని జెన్నీఫర్ తెలిపారు. మనిషి మానసికంగా ఎదిగేది కేవలం హృదయం ముక్కలైన సందర్భాల్లోనేనని.. అది ప్రేమ వైఫల్యం కావచ్చు లేదా వృత్తిపరమైన నిరాశ కావచ్చు, అటువంటి క్లిష్ట సమయాల్లోనే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకుని తప్పులను దిద్దుకుంటారని పేర్కొన్నారు. కాగా, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్‌తో 2025లో విడాకులు తీసుకున్న (ఆమెకు ఇవి నాలుగో విడాకులు) నేపథ్యంలో సంబంధ బాంధవ్యాలపై జెన్నీఫర్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు