ప్రధమ చికిత్స కూడా చేయని పల్లె దవాఖాన…….!

ప్రధమ చికిత్స కూడా చేయలేని పల్లె దవాఖాన…….!*

*పల్లె దవాఖానకు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి*

*డి సీతా లక్ష్మి ఐద్వా భద్రాచలం పట్టణ కార్యదర్శి*

*ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పల్లె దవఖాన సమస్యలపై సర్వే*

భద్రాచలం… TODAY… 9….పవన్ 

భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ పేరుతో ప్రభుత్వ నిర్వహిస్తున్న పల్లె దవఖానకు కనీసం ప్రధమ చికిత్స చేసే సిబ్బంది కూడా లేకపోవడంతో పల్లె దవఖాన అలంకారప్రాయంగా మిగిలిపోతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాచలం పట్టణ కార్యదర్శి డి సీత లక్ష్మి ఆరోపించారు. శుక్రవారం ఐద్వా డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ వ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖాన సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా బీ సీతాలక్ష్మి మాట్లాడుతూ సుమారు 8000 మంది ప్రజలకు అందుబాటులో ఉన్న అశోక్ నగర్ పల్లె దవఖాన సెంటర్ కి ఎం.ఎల్ హెచ్ పి పోస్టు గత రెండు సంవత్సరాలగా ఖాళీగా ఉందని అన్నారు.

ఇలా ఉంటే పల్లె దవాఖానకు ఉండవలసిన ఫస్ట్ ఏఎన్ఎం సైతం ఖాళీగా ఉండటంతో పేదలకు కనీస వైద్య సౌకర్యం కూడా లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వం నుండి కావలసిన మందులు అందుబాటులో ఉన్నప్పటికీ పేదలకు అందించేందుకు సిబ్బంది లేక నిరుపయోగంగా మారిపోతున్నాయని సితాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర కేసులకు ప్రథమ చికిత్స చేసి పెద్ద ఆసుపత్రికి తరలించాల్సిన పల్లె దవాఖానకు రెండు సంవత్సరాలుగా సిబ్బంది కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. కేవలం ద్వితీయ ఏఎన్ఎం 14 వ వార్డు ఆశా కార్యకర్త సమక్షంలోనే ఇంత పెద్ద పల్లె దవఖాన నిర్వహించబడుతుందని అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫీల్డ్ విధుల్లో ఉండాల్సిన సెకండ్ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పల్లె తవఖాన సేవలు ఎలా నిర్వహిస్తారని శీతాలక్ష్మి ప్రశ్నించారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అశోక్ నగర్ పల్లె దవఖానకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా వైద్యంపై సమగ్ర సర్వేలు నిర్వహిస్తున్నామని ఈ సర్వేలో వచ్చిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీతాలక్ష్మి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నాయకురాలు నాదెండ్ల లీలావతి జిల్లా కమిటీ సభ్యులు జీవనజ్యోతి ఉస్తేల జ్యోతి డివైఎఫ్ఐ నాయకులు దారిశెట్టి సతీష్ బాబు సండ్ర భూపేంద్ర సిఐటియు నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు