తిరుమలకు మెట్లెక్కి వెళ్లిన 116 ఏళ్ల బామ్మ..! సోషల్ మీడియాలో వైరల్..!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఓ బామ్మ కాలినడకన కొండ ఎక్కారు. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

 

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడకదారిలో స్వామివారిని చేరుకుంటారు. అయితే, ఈ మార్గంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణించడం చాలా కష్టం. అలాంటిది, 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కుతుండటాన్ని చూసిన మరో భక్తురాలు వీడియో తీశారు.

 

ఈ బామ్మ తమిళనాడుకు చెందిన వారని తెలుస్తోంది. ఆమె మనోబలం, దైవభక్తిని చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. “భక్తి ఉంటే వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు”, “ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు