ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి ఐటీడీఏ పీవో..!

దుమ్ముగూడెం… వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి

ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థినిలకు చక్కటి విద్యాబోధనతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా ఆహారము వేడిగా ఉన్నప్పుడే అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు.

మంగళవారం నాడు దుమ్ముగూడెం మండలంలోని గౌరారం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, డార్మెటరీ రూమ్, స్టోర్ రూమ్ వంటశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక స్థాయి విద్యార్థినిలతో గణితం మరియు ఆంగ్లంలో విద్యార్థినిలు కనపరుస్తున్న ప్రతిభను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను ప్రశంసిస్తూ ఈ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. పదవ తరగతి విద్యార్థినిలను పరీక్షల చివరి 100 రోజుల వరకు వేచి ఉండకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే క్రమబద్ధమైన కార్యచరణ ప్రణాళికతో ప్రతిరోజు చదివేలా చూడాలని, విద్యార్థినిలు కూడా నిరంతర సాధన క్రమశిక్షణ మరియు లక్ష్యంతో కూడిన ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలకు మార్గం సుమగమవుతుందని విద్యార్థినిలకు సూచించారు. అలాగే ఉన్నత విద్యా మరియు భవిష్యత్తు ఉద్యోగాల అవకాశాల కోసం ఇప్పటినుంచే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.

అనంతరం ప్రకృతిని సంరక్షించే బాధ్యత ప్రతి విద్యార్థినిలో పెంపొందించాలని లక్ష్యంతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో సపోటా మొక్కను నాటి, విద్యార్థినిలకు సిద్ధం చేస్తున్న పోషకాహార భోజనాన్ని స్వయంగా పరిశీలించి పరిశుభ్రత నిర్వహణ మరియు ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే ప్రమాణాలను నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. అలాగే సమీపంలోని జిపిఎస్ పాఠశాల విద్యార్థులను ఏ జి హెచ్ ఎస్ గౌరారం పాఠశాలల్లో విలీనం చేస్తే మరింత మెరుగైన విద్యా అవకాశాలు పిల్లలకు కల్పించవచ్చని అన్నారు.

అనంతరం గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి మరియు సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని అభినందిస్తూ పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థినిలు పిఓకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎం మోతిర్, వీరస్వామి మరియు విద్యార్థినిలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు