రూ.15 లక్షలతో బీసీ గర్ల్స్ హాస్టల్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు మండలంలోని బీసీ గర్ల్స్ హాస్టల్‌లో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు *పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
బీసీ గర్ల్స్ హాస్టల్‌లో రూ.15 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే విద్యార్థినులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థుల ఉపయోగానికి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాస్టల్‌లో విద్యార్థినులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. విద్యార్థినులకు అందిస్తున్న టిఫిన్ నాణ్యత, రుచి, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ నాణ్యమైన, పోషకాహారంతో కూడిన టిఫిన్‌ను మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలని, నియోజకవర్గంలోని విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మండల ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









