మణుగూరు సింగరేణి చరిత్రలో తొలిసారి కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి మణుగూరు పర్యటన
Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
భారత ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రేపు ఉదయం మణుగూరు PK OC-II ప్రాజెక్టులో జరిగే గేట్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ప్రాజెక్టు చరిత్రలో కేంద్ర మంత్రి పాల్గొనడం ఇదే తొలిసారి.
1985లో మణుగూరు జూనియర్ కాలేజీ విద్యార్థి సంఘం ఎన్నికల సమయంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మణుగూరుకు వచ్చారు. అప్పుడు చెలరేగిన గొడవలను 3 రోజుల పాటు ఉండి అన్ని విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించారు. ఆనాడు సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి మణుగూరుకు వస్తున్న తరుణంలో. PK OC-II డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించి మణుగూరు భవిష్యత్తుకు భరోసా కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.









