US Visa: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 1.75 లక్షలకు పైగా అమెరికా వీసాలు రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,75,000కు పైగా వీసాలను రద్దు చేశారు. నేరాలకు సంబంధించిన కేసులు, వీసా నిబంధనల ఉల్లంఘనలు, మోసాలు, జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన చర్యలు వంటి కారణాలతో ఈ వీసాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

వీసా నిబంధనలను ఉల్లంఘించడం, క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి అంశాలు ఈ చర్యల్లో ప్రధాన కారణాలుగా ఉన్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. దాడులు, డ్రంక్ డ్రైవింగ్ (DUI), దొంగతనం, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలతో పాటు అత్యంత తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న కొందరి వీసాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.

అమెరికా జాతీయ భద్రత, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వీసా పరిశీలన ప్రక్రియను మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీయులు అమెరికా వీసా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడితే వీసా రద్దుతో పాటు ఇతర చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు