QR Code: మూడు మూలల్లోనే నల్ల బాక్సులు ఎందుకు ఉంటాయి? కారణం ఇదే!

డిజిటల్ పేమెంట్స్ విస్తరించడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా QR కోడ్‌లు కనిపిస్తున్నాయి. షాపులు, రెస్టారెంట్లు, బిల్లులు, పోస్టర్లు ఇలా అనేక చోట్ల వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే QR కోడ్‌ను కాస్త నిశితంగా గమనిస్తే మూడు మూలల్లో పెద్ద నల్లని బాక్సులు కనిపిస్తాయి. నాలుగో మూల మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం ఏర్పాటు చేసినది కాదు. QR కోడ్ సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ప్రత్యేక సాంకేతికత ఇందులో దాగి ఉంది.

ఆ మూడు పెద్ద బాక్సులను Finder Patterns లేదా Position Detection Patterns అని పిలుస్తారు. QR కోడ్‌ను కెమెరా స్కాన్ చేస్తున్నప్పుడు కోడ్ ఏ దిశలో ఉందో, దాని పరిమాణం ఎంతగా ఉందో, ఎక్కడి నుంచి చదవాలో గుర్తించేందుకు ఇవి స్కానర్‌కు సహాయపడతాయి. కోడ్‌ను తలకిందులుగా లేదా వేరే కోణంలో ఉంచినా స్కానర్ దాన్ని సులభంగా గుర్తించగలగడానికి ఈ నమూనాలు ఉపయోగపడతాయి.

అయితే నాలుగో మూలలో పెద్ద బాక్స్ ఎందుకు ఉండదంటే.. అక్కడ ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల QR కోడ్‌లోని ఇతర సమాచారాన్ని సులభంగా గుర్తించి చదవడానికి అవసరమైన స్థలం లభిస్తుంది. అంతేకాదు QR కోడ్‌లోని Alignment Pattern వంటి ఇతర అంశాలు కూడా కోడ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మూడు మూలల్లో కనిపించే నల్లని బాక్సులు QR కోడ్ అందంగా కనిపించేందుకు మాత్రమే కాకుండా.. దాన్ని వేగంగా, కచ్చితంగా స్కాన్ చేయడానికి రూపొందించిన టెక్నాలజీలో ముఖ్యమైన భాగం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు